రోజువారీ సరుకులు లభించే 'కన్వినియెన్స్ స్టోర్‌'ల వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్

by Harish |
7th-Eleven-1
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ రిలయన్స్ రిటైల్ సంస్థ దేశీయ కన్వినియెన్స్ స్టోర్ల వ్యాపారంలోకి రానున్నట్టు వెల్లడించింది. దీనికోసం అమెరికాకు చెందిన 7-ఎలెవెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. మొదటగా ముంబైలో మొదటి స్టోర్‌ను ఈ వారాంతంలో ప్రారంభించనున్నారు. ‘కన్వినియెన్స్ స్టోర్’ అంటే సాధారణ ఇంటి అవసరాలకు వాడే కిరాణా సరుకులు, స్నాక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, స్వీట్స్, న్యూస్ పేపర్, మ్యాగజైన్ లాంటి వినియోగ వస్తువులను విక్రయించే చోటు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ రిటైల్ భారత్‌లో ఈ 7-ఎలెవెన్ కన్వినియెన్స్ స్టోర్లను నిర్వహించనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ రిటైల్ తెలిపింది. కాగా, కిశోర్ బియానికి చెందిన ఫ్యూచర్ రిటైల్ కంపెనీ ఇదివరకు 7-ఎలెవెన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం రద్దు జరిగిన రోజుల వ్యవధిలోనే రిలయన్స్ రిటైల్ ఈ ప్రకటన చేయడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రోజువారీ అవసరాలకు కావాల్సిన వస్తువులు లభించే ఈ కన్వినియెన్స్ స్టోర్లకు మెరుగైన డిమాండ్ ఉంది. 7-ఎలెవెన్ కంపెనీ ఇప్పటికే 18 దేశాల్లో వేల సంఖ్యలో కన్వినియెన్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed