- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన రిలయన్స్ జియో!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2.74 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా విడుదల గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో రిలయన్స్ జియో 1.9 కోట్లు, వొడాఫోన్ ఐడియా 10.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్టు సోమవారం వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా వరుసగా 11వ నెలలోనూ వినియోగదారులను కోల్పోవడం గమనార్హం. ఎయిర్‌టెల్ ఎయిర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటా 0.08 శాతం పెరగ్గా, రిలయన్స్ జియో 4.29 శాతం క్షీణించినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
మొత్తం సబ్‌స్క్రైబర్లు 118 కోట్ల నుంచి 116 కోట్లకు తగ్గారని, నెలవారీగా ఇది 1.74 శాతం క్షీణత నమోదైనట్టు ట్రాయ్ తెలిపింది. కాగా, సోమవారం నాటి ప్రకటనలో ఎయిర్‌టెల్ సంస్థ తన ప్రీపెయిడ్ టారిఫ్‌ల ధరలను 20-25 శాతం మధ్య పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్ ధర 5.8 శాతం పెరిగింది. అలాగే, వొడాఫోన్ ఐడియా కంపెనీ షెర్లు సైతం 6 శాతం లాభపడింది.