జియో, ఎయిర్‌టెల్ మధ్య కీలక ఒప్పందం

by Harish |   ( Updated:2021-04-06 10:55:47.0  )
జియో, ఎయిర్‌టెల్ మధ్య కీలక ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో 800 మెగా హెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ వినియోగం కోసం రూ. 1,497 కోట్లకు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం చేసుకున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మంగళవారం వెల్లడించింది. మెరుగైన స్పెక్ట్రమ్ కొనుగోలుతో మౌలిక సదుపాయాలకు, జియో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని జియో పేర్కొంది.

ఈ ఒప్పందం స్పెక్ట్రమ్ ట్రేడింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని, దీనికి సంబంధించి నియంత్రణ అనుమతులు, చట్టబద్ధమైన ఆమోదం రావాల్సి ఉందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఉపయోగించకుండా ఉన్న 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ విక్రయం ద్వారా అన్‌లాక్ చేయబడిందని, ఇది తమ నెట్‌వర్క్ వ్యూహంలో భాగంగా జరిగినట్టు’ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విటల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed