- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి : మంత్రి జూపల్లి

దిశ,వనపర్తి/పానగల్: ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని రాష్ట్ర ఎక్సైజ్,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా,పానగల్ మండలం,రేమద్దుల కిష్టాపూర్ తండా,గోపులాపూర్,అన్నారం గ్రామాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం పరిపాలించి ఎనిమిది లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించారు. భారతదేశ 75 సంవత్సరాల కాలంలో 65 సంవత్సరాలు టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని నడిపి 64 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కెసిఆర్ ప్రభుత్వం కేవలం 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోరూ. లక్ష యాభై వేల కోట్లుఅప్పు తెచ్చి 6 వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు మిత్తిలు కడుతుందని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పైసా పైసా కూడా గట్టి దశలవారీగా అమలు చేస్తుందని వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 21 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసామన్నారు.గ్రామాలలో సాగునీరంధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్య,జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పంచాయతీ శాఖ ఎస్.ఈ మల్లయ్య,డీఆర్ డీ ఓ రమాదేవి,సాగునీటి శాఖ ఎస్ ఈ డీ ఈ లు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.