రిలయన్స్ సంచలన నిర్ణయం.. ఏడాది జీతం వదులుకోనున్న ముఖేశ్!

by Harish |
రిలయన్స్ సంచలన నిర్ణయం.. ఏడాది జీతం వదులుకోనున్న ముఖేశ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పూర్తి వేతనన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ముఖేశ్ అంబానీ 12 ఏళ్లుగా స్థిరమైన వేతనాన్ని తీసుకుంటున్నారు. 2009 నుంచి ఆయన వేతనాన్ని పెంచుకోలేదు. అయితే, కరోనా వైరస్ కారణంగా రిలయన్స్ సంస్థకు నష్తాలొచ్చాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన వ్యాపారాలైన ఆయిల్, ఫార్మా సంస్థల మీద అధిక ప్రభావం పడింది. దీన్ని అధిగమించేందుకు పైస్థాయిలో ఉన్నవారి వేతనాల్లో రిలయన్స్ కోత విధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను తగ్గించాలనే వేతనాల్లో కోత తప్పాని రిలయన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. రిలయన్స్ సంస్థ ఆర్థిక, వ్యాపార పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ఆదాయ మార్గాలను పెంచుకుంటోంది. లాక్‌డౌన్ వల్ల కూడా కొన్ని అవకాశాలు కల్పించినప్పటికీ అయితే, ఇవి సరిపోవు. మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తిరిగి జీతాలు మామూలుగానే అందుకునేందుకు ప్రయత్నిద్దాం. సంస్థ ఉత్పత్తి పెంచుకోడానికి, వ్యయాన్ని తగ్గించడానికి, డిజిటలీకరణ వైపు కొత్త మార్గాలు మనకున్నాయి అని రిలయన్స్ యాజమాన్యం ఉద్యోగులకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది.

Tags: coronavirus, Covid-19, Mukesh Ambani, Pay Cut, RIL, Reliance Industries announces pay cuts

Advertisement

Next Story

Most Viewed