రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం.. సొంతంగా ఆర్-సురక్షా టీకా

by vinod kumar |   ( Updated:2021-04-23 00:24:14.0  )
R-Suraksha vaccine
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి ఉద్యోగులను, ప్రజలను కాపాడుకునేందుకు రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకాలు అందించనున్నట్లు తెలిపింది. మే 1 నుండి ఆర్-సురక్షా పేరుతో రిలయన్స్ ఉద్యోగులు, అర్హత గల కుటుంబ సభ్యులకు కరోనా టీకాలు అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.

కరోనా విజృంభిస్తుండటంతో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ను కేంద్రం ఉచితంగా సరఫరా చేసింది. డిమాండ్ భారీ గా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మెల్లగా తప్పుకొంటుంది. టీకాలను కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ హాస్పిటల్ లకు రూ.600 చొప్పున ధరలను నిర్ణయించింది. దీంతో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ సంస్థలు కూడా స్వంతంగా వ్యాక్సిన్ టీకాలను వేయించుకోవచ్చు.

Advertisement

Next Story