ఏపీలో పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

by srinivas |
Yogi Vemana University
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. వైఎస్ఆర్ కడప యోగి వేమన యూనివర్సిటీ ఈ పీజీ సెట్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా బుధవారం ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.

ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 30గా పేర్కొంది. రూ.200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అయితే అక్టోబర్ 22న పీజీ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed