స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

by Shyam |   ( Updated:2021-11-16 02:22:11.0  )
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ మంగళవారం విడుదల అయింది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలో ఉన్న ఒక్కొక్క సీటు.. మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ కాగా.. కరీంనగర్ , మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. నేడు నోటిఫికేషన్ విడుదల కాగా… నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.

నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ కాగా.. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉండగా.. 26 ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరుగుతుంది. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed