ప్లీజ్ రవన్నా.. హిందీలో సినిమాలు తీయండి.. నార్త్ ఫ్యాన్స్ అప్పీల్

by Shyam |
ravi teja
X

దిశ, సినిమా : మాస్ మహరాజ్ రవితేజ తన సినిమాల జోరు పెంచాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడీ’ రిలీజ్ డేట్‌‌‌ను మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 11, 2022న థియేటర్స్‌లో ఖిలాడీ కేకలు పెట్టించబోతున్నాడంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దీనిపై రవితేజ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ‘సార్.. దయచేసి మీరు హిందీలో నటించండి లేదా డబ్బింగ్ వెర్షన్ అయినా రిలీజ్ చేయండి, మిమ్మల్ని బిగ్ స్ర్కీన్‌పై మిస్ అవుతున్నాం’ అని రవితేజపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక లేటెస్ట్ పోస్టర్‌లో సిగరెట్‌ తాగుతూ మాస్‌ లుక్‌లో దర్శనిమిచ్చిన మాస్ మహరాజ్.. సినిమాపై హైప్ పెంచేశాడు. కాగా గతంలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషించిన సినిమాలన్నీ హిట్ అయిన సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశముంది.

Advertisement

Next Story