రెండు ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ

by Shyam |   ( Updated:2020-03-20 06:56:53.0  )
రెండు ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణ
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి పరిశీలించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య పర్యవేక్షణలో సంబంధిత అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి పి. లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి నామినేషన్లు సరైన పద్ధతిలో ఉన్నట్లు గుర్తించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మోహన్ రెడ్డి, నరసింహారావు నామినేషన్లు కూడా సరిగ్గా ఉన్నట్లు తెలిపారు. శ్రమజీవి పార్టీ తరఫున నామినేషన్ వేసిన జే. భాస్కర్ ఫారం 2ఈ లో వివరాలు సరిగా లేవని, మరో స్వతంత్ర అభ్యర్థి అయిన కే. శ్రీనివాస్ ఫారం 26 లో సమర్పించిన అఫిడవిట్ వివరాలు పూర్తిగా లేనందున తిరస్కరించినట్లు నారాయణరెడ్డి తెలిపారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది.

Tags: MLC nominations, Rejected, nizamabad

Next Story

Most Viewed