- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లు షురూ
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన స్లాట్ బుకింగ్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా శుక్రవారం ఆయన బీఆర్కే భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్ మేరకు, హైకోర్టు ఆదేశాలకనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పారదర్శకంగా, సులభతరంగా, విచక్షణ లేకుండా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కొనుగోలుదారులు, విక్రయదారులు స్లాట్ కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ కు పాత చార్జీలే అమలులో ఉన్నాయన్నారు. ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీల వివరాలు జనరేట్ అవుతాయన్నారు. ఆధార్ ఇవ్వని వారికోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ లను కేటాయిస్తామని, డిమాండ్ మేరకు వాటిని పెంచుతామని అన్నారు. సాంకేతికం సమస్యలను ఎప్పటికప్పుడు టెక్నికల్ టీం పరిష్కరిస్తుందన్నారు. www.registration.telangana.gov.in ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
సరళీకృత సేవలు
స్లాట్ బుకింగ్ కోసం TPIN,PTIN అసెస్మెంట్ నంబర్లను ఫీడ్ చేయాలి. ఇవి లేనివారు స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లోనే నంబరు జారీ చేస్తారని సీఎస్ వివరించారు. ప్రస్తుతం 96 శాతం నుంచి 97 శాతం దాకా రిజిస్ట్రేషన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షులు తమ ఐడీ ప్రూఫ్ లతో హాజరు కావాలని సూచించారు. ప్రస్తుతం సేల్, మార్టిగేజ్ విత్ పొసెషన్, మార్టిగేజ్ విత్ అవుట్ పొసెషన్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, డెవలప్ మెట్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసెషన్ లాంటి సర్వీసులు లభిస్తాయని చెప్పారు. డేటా సిస్టంకు సంబంధించి అవసరమైన సెక్యూరిటీ వ్యవస్ధను ఏర్పాటు చేశామన్నారు. 24 లైన్లతో కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. కాల్ సెంటర్ నెంబర్ 18005994788 కు ఫిర్యాదు చేస్తే ఐటీ శాఖ పరిష్కరిస్తుందన్నారు.
రియల్ ఎస్టేట్ బిల్డర్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఈ పాస్ బుక్ జారీ అవుతుంది. 7 నుంచి 10 రోజుల లోపు రెగ్యులర్ పాసు బుక్ జారీ చేస్తారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వ్యవసాయ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 55,216 లావాదేవీలు జరిగాయని సీఎస్ తెలిపారు. ధరణికి 1.24 కోట్ల హిట్స్ వచ్చాయని, 74 వేల స్లాట్ బుకింగ్ లు జరిగాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు
(బాక్స్ 1 )
ధరణి ప్రతిరూపమే
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయొచ్చునని, వాటిని ఆపాలని ఎక్కడా చెప్పలేదని హైకోర్టు పేర్కొంది. గతంలోలాగా కార్డ్ విధానం ద్వారానే క్రయవిక్రయాలు ప్రారంభిస్తారని అంచనా వేశారు. ప్రభుత్వం ధరణి పోర్టల్–2 కోసం రూపొందించిన ఆధారాలు, పద్ధతులతోనే అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్డ్ విధానంలో ఈ ఆప్షన్లు, స్టెప్స్ లేవని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. ధరణి లాంటి కార్డ్ గా అభివర్ణిస్తున్నారు. నాన్ అగ్రికల్చర్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే హోం, స్లాట్ బుకింగ్ సమాచారం, యూజర్ మాన్యువల్ కనిపిస్తాయి. ప్రస్తుతం స్లాట్ బుకింగ్‌లో ఇండిపెండెంట్ హౌజ్, అపార్టుమెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ మూడు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
బిల్డర్, డెవలపర్ కు ప్రత్యేకంగా లాగిన్ అవకాశం ఇచ్చారు. అలాగే ఈసీ, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ చూడొచ్చు. ప్రాపర్టీ వివరాలు. ప్రాపర్టీ సరిహద్దులు. మార్కెట్ విలువ. ప్రాపర్టీ వివరాల్లో పీటీఐఎన్/అసెస్మెంట్ నంబరు, ఆధార్ నంబరు(ఆప్షనల్), వయసు, వృత్తి, పాన్ నంబరు. కొనుగోలు, విక్రయదారులకు చెందిన కమ్యూనికేషన్ డిటెయిల్స్ ను ఎ4 సైజు పేపరులో పొందుపర్చాలి. ప్రస్తుతం వెబ్ సైట్ లో స్లాట్ బుకింగ్ కు ఇండిపెండెంట్ హౌజ్, అపార్టుమెంట్స్, కమర్షియల్కాంప్లెక్స్ క్రయ విక్రయాలకు పరిమితం చేశారు. ఓపెన్ ప్లాట్లకు ఆప్షన్ కనిపించలేదు.
(బాక్స్ 2)
టిపిన్ కోసం దరఖాస్తు చేసుకోండి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో టిపిన్ (అసెస్మెంట్) నంబరు తప్పనిసరి. అది లేకపోతే క్రయ విక్రయాలు జరుగవు. ఓపెన్ ప్లాట్లకు ఆ నంబర్లు ఉండవు. వీటి కోసం స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. రెండు రోజుల్లో నంబరు జారీ చేస్తారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లకు మాత్రమే టిపిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ పొందిన ప్లాట్లకు కూడా ఇస్తారు. అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ఓపెన్ ప్లాట్లకు ఈ అసెస్మెంట్ నంబరు ఇవ్వరు. ఈ ప్రక్రియతోపాటు ధరణి వంటి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెండో శనివారం, ఆదివారం కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పని చేస్తుంది. ఉద్యోగులంతా కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశించారు.