23నుంచి వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్

by Anukaran |   ( Updated:2020-11-15 05:33:43.0  )
23నుంచి వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈనెల 23నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనునున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌‌పై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రజల ఆదరణ పొందుతోందని, భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. చిన్నచిన్న సమస్యలను ధరణి పోర్టల్ అధిగమించిందని, కేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందన్నారు. మరో నాలుగు రోజుల్లో 100శాతం అన్నిరకాల సమస్యలను అధిగమిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story