- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనిషి చేసిన పాపాల కోసమే యేసుక్రీస్తు అలా ఉండిపోయారు.. ఎమ్మెల్యే రేగా కాంతారావు
దిశ, మణుగూరు: తల్లిదండ్రులు నిన్ను మరచినను.. నేను నిన్ను మరువను, ఎడబాయను అన్న యేసుక్రీస్తు మాటలు ఎంతో గొప్పవని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
బుధవారం మండలంలోని కల్యాణ మండపంలో స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, జెడ్పీటీసీ పోశం నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. క్రీస్తు దైవసంభూతుడని వ్యాఖ్యానించారు. మనిషి చేసిన పాపాల కోసమే యేసుక్రీస్తు సిలువలో ఉండిపోయారన్నారు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి యేడాది క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు కొత్త దుస్తుల పంపిణీ ఆనవాయితీగా కొనసాగిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపాడు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘ సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, జావిద్ పాషా, ఎంపీటీసీ గాజుల రమ్య, మాజీ ఎంపీటీసీ మేకల రవి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, చర్చి పాస్టర్లు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.