పెళ్లికి నిరాకరించిందని… యువతిపై ఉన్మాది దాడి

by Shyam |   ( Updated:2020-09-21 03:22:25.0  )
పెళ్లికి నిరాకరించిందని… యువతిపై ఉన్మాది దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కృష్ణరాయనిపల్లిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ ఉన్మాది, యువతిపై దారుణంగా దాడి చేశాడు. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని బావించి, యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం వాటర్ ట్యాంక్ మీదనుంచి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాంపల్లి గ్రామానికి చెందిన శివ, ఓ యువతి కొద్దినెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈరోజు ఉదయం ప్రేమికులు మాట్లాడుకుంటుండగా యువతికి పెళ్లి నిశ్చయం అయిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శివ విచక్షణారహితంగా యువతి ముఖంపై రాయితో కొట్టడంతో… ఆమెకు బలమైన గాయమై రక్తస్రావం అయ్యింది. దీంతో భయపడిపోయిన శివ, వాటర్ ట్యాoక్ పైనుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శివను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story