నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు

by Shamantha N |
నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
X

దిశ, న్యూస్​బ్యూరో: పీజీ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ -2020 అర్హత కటాఫ్​ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కటాఫ్​ మార్కులతో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను జూలై20 నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ర్యాంక్​ కార్డు పంపించడం సాధ్యపడదని, ఆన్​లైన్​లోనే ర్యాంకు కార్డు తీసుకోవాలని అభ్యర్థులకు శాఖ సూచించింది. జనరల్‌ అభ్యర్థులకు గతంలో ఉన్న 366మార్కులను 275 మార్కులకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 319 మార్కుల కటాఫ్​ ఉండగా 230, దివ్యాంగులకు 342 మార్కులు ఉన్న కటాఫ్​ను 252 మార్కులకు తగ్గిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా మూడు రోజులు గడువుతో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Advertisement

Next Story