కిచెన్‌లో దెయ్యం.. సోషల్ మీడియాలో భయ్యం!

by Shyam |
కిచెన్‌లో దెయ్యం.. సోషల్ మీడియాలో భయ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్ : దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? లేదా ఉట్టి గాలివార్తలేనా? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరి సమాధానం ఒక్కోలా ఉంటుంది. దెయ్యాలపై ఎక్కువ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ.. సినిమా మొత్తం అటువంటి సీన్లతో భయపెట్టి, క్లైమాక్స్‌‌కు వచ్చేసరికి దెయ్యం ఉందా? లేదా? అన్న కన్ఫ్యూజన్ స్టేట్‌ను ప్రేక్షకుల్లో కలిగిస్తాడు. అయితే సినిమా చూస్తున్నంత సేపు భయాన్ని కలిగించడలో మాత్రం సక్సెస్ అవుతాడు. కాగా ఈ భయం సినిమా వరకే పరిమితం కాదు. మనుషుల్లో నిజంగా దెయ్యం అనే భయం ఉంది. టెక్నాలజీ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఈ దెయ్యాలేంటి అని కొందరు వాదించొచ్చు. కానీ, దేవుడున్నాడని నమ్మేవారంతా.. దెయ్యం కూడా ఉందనే నమ్ముతారు. కాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఈ విషయంపై చర్చకు దారితీసింది.

అమెరికాకు చెందిన సోషల్ మెసేజింగ్ అండ్ డిస్కషన్ వెబ్‌సైట్ ‘రెడ్డిట్‌’లో ఓ యూజర్.. తన ఇంట్లోని కిచెన్‌లో దెయ్యం ఉందని అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేశాడు. అంతేకాదు కిచెన్‌లో వింతవింత శబ్దాలు వినపడ్డాయని, వెంటనే ఫొటో తీసి చూస్తే ఎవరో ఆ ఫొటోలో ఉన్నారని అనిపించిందని యూజర్ @oopyspoopyman తెలిపారు. ఇదే ఫొటోను రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా, 6,200 మంది అప్‌ఓట్ చేశారు. కాగా ఫొటోను జూమ్ చేసి చూస్తే.. మాస్క్ వేసుకుని ఉన్న ఓ వింత ఆకృతి కిచెన్ డోర్ పక్క నుంచి బయటకు చూస్తున్నట్లు కనిపిస్తోందని కొందరు చెప్తే, ఆ ఆకృతి ‘ద గ్రడ్జ్’ హర్రర్ మూవీలోని చైల్డ్ ఘోస్ట్‌లా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరేమో ఆ ఫొటో ఉట్టి షోకేజ్ అని, ఎవరో డెకరేట్ చేసినట్లు ఉందని అభిప్రాయపడితే.. ఫొటోషాప్‌లో డిజైన్ చేసి పెట్టారని మరింకొంతమంది నెటిజన్లు చెప్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. ఈ ఫొటోను ఏదో అతీంద్రియ శక్తి యాదృచ్ఛికంగా పంపిందని, ఇదో భయంకర రూపమని, సరిగ్గా చూస్తే మీకు కూడా ఆ భయంకర ఆకృతి కనపడుతుందని సూచించాడు.

Advertisement

Next Story

Most Viewed