- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగర్‌కర్నూల్ లో కంటన్మెంట్
దిశ, మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల్ పట్టణంలో రెడ్ జోన్ ఏర్పాటైంది. పట్టణంలోని గాంధీ పార్క్ ఏరియా సమీపంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఈ ప్రాంతానికి చెందిన 30 మందిని క్వారంటైన్ లో ఉంచారు. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఇందులో భాగంగా పుల్లారెడ్డి హాస్పిటల్ రోడ్డు నుంచి వీరశేఖరం ఇంటి వరకు, సంత బజార్ నుంచి అమ్మవారి గుడి వరకు రాకపోకలు నిషేధించారు. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన సేవల కోసం మున్సిపల్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇక్కడి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావడానికి వీల్లేదని వారికి తెలిపారు. అదే సమయంలో ఇతరులు వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ అవసరాల కోసం మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేస్తే కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తారని చెప్పారు. రెడ్ జోన్ ఏర్పాటును పోలీసు, మున్సిపల్, వైద్య శాఖ అధికారులు సాయంత్రం పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రెడ్ జోన్ అమలులో ఉంటుందని కమిషనర్ అన్వేశ్ తెలిపారు.
Tags:red alert in nagar kurnool, red alert, lockdown nagarkurnool