- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఎత్తులకుపైఎత్తులు వేస్తున్న ‘సర్దార్జీ’.. సరికొత్త నినాదంతో ముందుకు..!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు కొత్తగా ఓ నినాదాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘ఓటీ బ్యాచ్.. బీటీ బ్యాచ్’ స్లోగన్‌తో ముందుకు సాగాలని రెబల్ అభ్యర్థి సర్దార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి పని చేసిన వారిని విస్మరిస్తూ, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన కొత్త వారికి పదవులను కట్టబెడుతున్నారన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కారులపై జరుగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు అందరి మద్దతు కూడగట్టుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా మొదట టీఆర్ఎసేతర పార్టీల నాయకులతో సమావేశం అవుతున్న రవీందర్ సింగ్.. ఆ తరువాత ఉద్యమ కారులతో కూడా టచ్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఉద్యమ కాలంలో పనిచేసిన ‘ఒరిజనల్ తెలంగాణ’ (ఓటీ) బ్యాచ్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నత పదవులు చేపట్టి ఏంజాయ్ చేస్తున్న ‘బంగారు తెలంగాణ’ (బీటీ)బ్యాచ్ సీఎం కేసీఆర్ చుట్టూ చేరిందన్న విషయాన్ని వివరిస్తూ అందరి మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు.