భూమిని ఆక్రమించి.. మంత్రుల పేర్లు చెప్పి బెదిరింపులు..

by Shyam |
భూమిని ఆక్రమించి.. మంత్రుల పేర్లు చెప్పి బెదిరింపులు..
X

దిశ, జనగామ : రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే(జూన్ 2).. తమ ఆస్తి, తమ ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ కార్యాలయం ముందు భూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన రాపోలు పుల్లయ్యతో పాటు ఐదుగురు అన్నదమ్ములకు చెందిన 18 ఎకరాల భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నుపడింది. దీంతో వారు భూ ఆక్రమణకు పాల్పడగా.. ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తుందని.. ఇది సరైన పద్ధతి కాదంటూ బాధితులు వారిని నిలదీయగా.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావు పేర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు.

కొంతమంది రియల్టర్లు స్థానిక పోలీసుల సహాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రియల్టర్ల నుంచి తమకు రక్షణ కల్పించి.. వారికి రావాల్సిన భూమిపై పూర్తి విచారణ చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed