- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ జిల్లాలో రియల్టర్ కిడ్నాప్ కలకలం..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో రియల్టర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పట్టణంలోని దివ్య నగర్‌లోని తన్వి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విజయ్ దేశ్పాండేను ఆదివారం ఉదయం సంగారెడ్డికి చెందిన రాజేశ్వర్ అనే వ్యక్తితో పాటు మరి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ పట్టణ పోలీసులు అప్రమత్తమై వారిని వెంబడించారు.
ఇది గమనించిన కిడ్నాపర్లు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్లడంతో పట్టణ పోలీసులు ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాపర్లను వెంబడించి తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంటలోనే కిడ్నాప్ కేసును చేధించిన నిర్మల్ పట్టణ పోలీసులను, ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులను నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి అభినందించారు. భూముల కొనుగోలు డబ్బుల విషయంలోనే కిడ్నాప్‌కు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డిలో విజయ్ దేశ్‌పాండే రెండు కోట్ల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారమే కిడ్నాప్ వరకు వెళ్ళినట్లు తెలుస్తోంది.