- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియాలిటీ షో విన్నర్‌కు.. స్పేస్ ట్రిప్ చాన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రియాలిటీ షోస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రియాలిటీ షోలో పాల్గొనే సాధారణ వ్యక్తులు లేదా సెలెబ్రిటీలు.. తమ రోజువారీ జీవితాల్లో ఎదురైన చాలెంజెస్‌ను ఎలా ఎదుర్కొంటారనే కాన్సెప్ట్‌తో సదరు షో కొనసాగుతుంది. అందులో భాగంగా కెమెరాల ద్వారా పార్టిసిపెంట్ల కదలికలన్నింటినీ రికార్డు చేస్తుంటారు. టెలివిజన్ తెరపై ప్రసారమయ్యే ఈ తరహా షోస్‌కు ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి ఓటింగ్ ఆధారంగానే విజేతను ఎంపిక చేస్తారు. అలా గెలుపొందిన వారికి లక్షలాది రూపాయలు, కార్లు, భవనాలు.. బహుమతులుగా ఇస్తుంటారు. కానీ తొలిసారిగా ఓ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన వ్యక్తిని ‘స్పేస్ ట్రిప్’ తీసుకెళ్లనున్నారు.
అమెరికాకు చెందిన మీడియా ప్రొడక్షన్ కంపెనీ స్పేస్ హీరో ఇన్‌కార్పొరేషన్.. త్వరలోనే ‘స్పేస్ హీరో’ అనే పేరుతో ఓ రియాలిటీ షోను ప్రారంభించనుంది. ఈ షో ఎలా నిర్వహించాలి.. ఎలాంటి పోటీలు పెట్టాలి? అనే దానిపై నాసాతో హీరో ఇన్‌కార్ప్ చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని హీరో ఇన్‌కార్ప్ తెలియజేయగా.. స్పేస్‌కు వెళ్లాలనే ఆసక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ షోలో పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా రియాలిటీ షోకు అప్లయ్ చేసిన అభ్యర్థుల ఫిట్‌నెస్ లెవల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. స్పేస్ సెంటర్‌లో ఆ వ్యక్తి ఉండగలడా? లేదా? అతడి మానసిక స్థితి ఎలా ఉంది? శారిరకంగా ఫిట్‌గా ఉన్నాడా లేదా.. ఇలా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఇస్తారు. అన్ని రియాలిటీ షోస్‌లో ఏ విధంగా అయితే.. ప్రేక్షకుల ఓట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారో, ఈ కార్యక్రమంలోనూ అంతే. ప్రేక్షకులదే అంతిమ నిర్ణయం.
విజేతగా నిలిచిన పార్టిసిపెంట్ పదిరోజుల పాటు స్పేస్ ట్రిప్‌కు వెళతాడు. ఇందులో భాగంగా.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో ఆ విజేత బస చేస్తాడు. ఇందుకోసం హీరో స్పేస్ ఇన్‌కార్పొరేషన్.. ప్రైవేట్ స్పేస్ కంపెనీ ‘ఆక్సియోమ్ స్పేస్’తో కలిసి పనిచేస్తుంది. ఆక్సియోమ్ సంస్థ.. పేయింగ్ కస్టమర్స్‌ను వచ్చే ఏడాది నుంచి స్పేస్‌లోకి తీసుకెళ్లనుంది. కాగా, 2023లో షో విజేతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) పంపుతామని నిర్వాహకులు వెల్లడించారు.