రియల్ ఎస్టేట్ రంగానికి గడ్డుకాలమే!

by Harish |
రియల్ ఎస్టేట్ రంగానికి గడ్డుకాలమే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల అనేక రంగాలు నష్టాల ఊబిలో ఇరుక్కున్నాయి. మార్కెట్లతో సంబంధం లేకుండా, ఎప్పుడూ డిమాండ్‌లో ఉండే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కరోనా కష్టాలు తప్పేలా లేదు. దేశ జీడీపీలో సుమారు 6 శాతం వాటా అందిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఆరు ప్రధాన నగరాల్లో 10 నుంచి 15 శాతం డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధింపు మూడు నెలలు గనక కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగానికి భారీ నష్టాలు తప్పవని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. రేటింగ్ ఏజెన్సీ వివరాల ప్రకారం ప్రధానమైన ఆరు నగరాల్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో నివాసాల డిమాండ్ 7 నుంచి 10 శాతం తగ్గనుంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇదే కాలంలో మొదటి తొమ్మిది నెలల్లో డిమాండ్ 4 శాతం తగ్గింది. కరోనా వ్యాప్తి వల్ల లాక్‌డౌన్, సామాజిక దూరం వంటి చర్యలు రానున్న మూడు నెలల వరకు కొనసాగితే నివాసానికి అవసరమైన డిమాండ్ 10 నుంచి 15 శాతం తగ్గుతుందని ఏజేన్సీ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం చూపించే నివాసాల డిమాండ్ పతనంతో ఆర్థిక పతనం తీవ్రంగా దెబ్బతింటుందని ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ అభిప్రాయపడింది.

Tags: coronavirus impact, covid-19, real estate, no demand for real estate

Advertisement

Next Story

Most Viewed