పరోటాపై 18 శాతం జీఎస్టీ!

by Harish |
పరోటాపై 18 శాతం జీఎస్టీ!
X

ముంబయి: ఇకమీదట రెస్టారెంట్‌లో పరోటాలు తినాలనుకుంటే చపాతీల కంటే అధికంగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలో చాలా మంది చపాతీలు, పరోటాలను ఇష్టంగా తింటారు. రుచిలో తేడా ఉన్నా రెండూ ఒకేలాంటి పదార్థాలే. ఇప్పటివరకు వీటి ధరలు రెస్టారెంట్లలో సమానంగా ఉన్నాయి. కానీ, ఇకనుంచి హోటళ్లు, రెస్టారెంట్లలోనూ పరోటా తినాలంటే ఎక్కువ బిల్లు చెల్లించక తప్పదు. పరోటాకు, చపాతికి తేడా ఉందని, అందుకే రెస్టారెంట్లలో వడ్డించే రెడీ టూ సర్వ్ పరోటాపై 18శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) పేర్కొంది. చపాతీ, రోటీలపై 5శాతం జీఎస్టీ వర్తించనుంది. పరోటా రెడీ టూ ఈట్ విభాగంలోకి వస్తుందని, అందుకే వాటికి 18శాతం జీఎస్టీ వర్తించనున్నట్టు ఏఏఆర్ కర్ణాటక బెంచ్ స్పష్టం చేసింది. ఇందులోకి రోటీలు రావని పేర్కొన్నది. చాలావరకు ఆహార పదార్థాలను, ముఖ్యంగా ఎసెన్షియల్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు జీఎస్టీ వర్తించదు. అయితే, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపైన ఉత్పత్తిని అనుసరించి 5శాతం, 12శాతం, 18శాతం జీఎస్టీ విధిస్తారు. ఉదాహరణకు పాపడ్‌‌పై జీఎస్టీ లేదు. పిజ్జాపై 5శాతం ఉంది.

Advertisement

Next Story

Most Viewed