ప్రైవేట్ బ్యాంకులతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం

by Harish |
ప్రైవేట్ బ్యాంకులతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా ఆర్థికవ్యవస్థ రికవరీకి ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమయ్యారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు కూడా పాల్గొన్నారు. భారత ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావం, బ్యాంకుల ఆస్తుల నాణ్యత, ముఖ్యమైన రంగాలకు రుణాలు వంటి అంశాలపై అంచనా వేసేందుకు ఈ సమావేశం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ ప్రకటించిన కరోనా ఉపశమన చర్యలతో పాటు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యాపారులు, వ్యక్తులకు అండగా నిలిచే పలు ఆర్థిక సేవలను వేగవంతంగా అమలు చేయాలని బ్యాంకులను దాస్ కోరారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రైవేట్ బ్యాంకుల కీలక పాత్రను ప్రస్తావించిన శక్తికాంత దాస్.. బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్ల పటిష్టతను కొనసాగించాలని, దానికి అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని కోరారు.

Advertisement

Next Story