- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 57 వేల కోట్ల డివిడెండ్‌కు ఆర్‌బీఐ ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19) సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి (Central Government) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 57,128 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లింపునకు ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆర్‌బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. భారీగా ఆదాయం పడిపోయిన సందర్భంలో ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీరేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి.
అలాగే కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ (Economy)లో ఏర్పడ్డ సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా, బ్యాంకుల పనితీరుపై ఆర్‌బీఐ (RBI) అధికారులు అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐతో పాటు పలు ఆర్థిక సంస్థల నుంచి ప్రస్తుత సంవత్సరంలో రూ. 60 వేల కోట్లు వస్తాయని అంచనా వేసింది. గతేడాది ఆర్‌బీఐ రూ. 1.76 లక్షల కోట్లను డివిడెండ్ (Dividend)రూపంలో చెల్లించింది. నిధుల కొరత ఏర్పడినప్పుడు కేంద్రం ఆర్‌బీఐపై ఆధారపడి డివిడెండ్ రూపంలో అందుకుంటుంది. ఆర్‌బీఐ కూడా పలుసార్లు మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తుంది.