- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా చాలా దూరం వెళ్లాలి.. రిటైర్మెంట్‌పై కుండ బద్దలు కొట్టిన జడేజా
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. వైట్ బాల్ క్రికెట్, తన కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ఈ ఆల్ రౌండర్ సుదీర్ఘమైన ఫార్మాట్‌ను విడిచిపెట్టాలని చూస్తున్నాడు అంటూ జడేజా సహచరుడు మీడియాకు తెలపడంతో అభిమానుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. క్రికెటర్లలో కూడా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో జడ్డూ ఏ పోస్టు పెట్టిన నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు.
ఇటువంటి సమయంలో తన రిటైర్మెంట్‌పై జడ్డూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. టెస్టు క్రికెట్ జర్సీ ధరించిన ఓ ఫొటోను అప్‌లోడ్ చేస్తూ.. ‘Long way to go’ అంటూ ట్విట్టర్‌లో క్యాప్షన్ పెట్టాడు. దీంతో అతడు ఇంకా టెస్టు క్రికెట్‌లో కొనసాగుతాడని సంకేతం ఇచ్చినట్టు స్పష్టమైంది. కాగా, ప్రస్తుతం జడేజాకు 33 సంవత్సరాలు. ఇంకా రిటైర్మెంట్‌కు ఐదేండ్ల సమయం ఉంది. అయినప్పటికీ రిటైర్మెంట్ విషయం వైరల్ కావడం గమనార్హం.
ఇటీవల న్యూజీలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టిన జడేజా.. అదే మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో సౌతాఫ్రికా టూర్‌లో జడ్డూను గాయం కారణంగా సెలెక్ట్ చేయలేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అయినా, జడేజా రిటైర్మెంట్ అనేది తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక రూమర్స్‌పై కూడా మంచి క్లారిటీ ఇచ్చిన జడేజా.. వెంటనే రిటైర్మెంట్‌పై కూడా అసలు విషయం చెప్పేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
సంచలనం రేపుతోన్న జడేజా ట్వీట్.. తలలు పట్టుకున్న నెటిజన్లు
వారే కావాలని కోహ్లీని బలిపశువును చేస్తున్నారా..?
- Tags
- cricket