వెటర్నరీ వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి

by Shyam |
వెటర్నరీ వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పశుసంవర్థక శాఖ కార్యదర్శి, ఇన్‌చార్జి వీసీ అనిత రాజేంద్ర ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి బాధ్యతలు అప్పగించారు. యూనివర్సిటీలో పౌల్ట్రీ విభాగం ప్రొఫెసర్‌గా, కోరుట్ల వెటర్నరీ అసోసియేట్ డీన్‌గా, వెటర్నరీ సైన్స్‌ డీన్‌గా, రిజిస్ట్రార్‌గా పనిచేసిన రవీందర్ రెడ్డి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. తిరిగి అదే వర్సిటీకి ఆయన వీసీగా నియమితులయ్యారు. వీసీగా తనకు అవకాశం ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story