పాత ఉద్యోగానికి వచ్చేసిన మాజీ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి

by Shyam |
పాత ఉద్యోగానికి వచ్చేసిన మాజీ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తిరిగి తన పాత ఉద్యోగానికి వచ్చేశాడు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియా – దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. స్టార్ స్పోర్ట్స్ చానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా రవిశాస్త్రితో స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రోమో కూడా విడుదల చేసింది. #FirstKaThirsty అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ ప్రోమో ఉన్నది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. అందుకే తొలి విజయం కోసం తపిస్తున్నారనే అర్దంలో ఆ ప్రోమోను తయారు చేశారు. ఇందులో సూప్ తయారు చేస్తూ.. గత సిరీస్‌ల గురించి రవిశాస్త్రి వివరిస్తూ కనపడుతున్నాడు. ఈ 45 సెకెన్ల ప్రోమోలో రవిశాస్త్రి లుక్ చాలా డిఫరెంట్‌గా ఉన్నది. అంతే కాకుండా అతడు వంట చేస్తూ కనిపించడం కూడా ఇదే మొదటి సారి. తనను తాను పొగుడుకుంటూ ఆస్ట్రేలియా జట్టుపై సెటైర్లు వేస్తూ చాలా జాలీగా కనిపించాడు. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో ఇండియా – సౌత్ఆఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story