- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండస్ట్రీ ముఠాలతో జాగ్రత్త : రవీనా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కేవలం నెపోటిజం, అణగదొక్కాలన్న కొందరి ప్రవర్తనే సుశాంత్ ప్రాణాలను బలితీసుకుందని ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎన్నెన్ని రాజకీయాలు నడుస్తాయో తెలుపుతూ వరుస ట్వీట్లు చేసింది సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. ‘అలాంటి పరిస్థితుల్లో ఎంత ఒత్తిడికి గురవుతారో అర్థం చేసుకోగలను’ అని.. నేను ప్రత్యక్షంగా అనుభవించి.. పోరాడితేనే ఇంత దూరం రాగలిగానని చెప్పింది.
ఇండస్ట్రీలో గ్యాంగ్‌లు నడుస్తున్నాయని హెచ్చరించినద రవీనా.. ‘అవి మన నుంచి ఫన్ కోరుకుంటాయి.. హీరోలు, గర్ల్ ఫ్రెండ్‌లు, జర్నలిస్ట్ చెంచాలతో కూడిన ఈ ముఠాలు.. ఫేక్ స్టోరీస్‌తో ఆర్టిస్ట్‌ల కెరియర్ నాశనం చేస్తున్నాయి’ అని మండిపడింది. కానీ వెనకడుగు వేయకుండా మనుగడ సాధించేందుకు ప్రయత్నించాలని కోరింది. ఒకవేళ మీరు నిజాలు మాట్లాడితే.. ‘మిమ్మల్ని అబద్ధాలకోరు, మాటకారి, సైకోలు’ అని ముద్రవేస్తారని, కొందరు చెంచా జర్నలిస్టులు మీరు చేసిన కృషిని నాశనం చేసేందుకు స్టోరీస్ రాస్తారని హెచ్చరించింది.
ఇక్కడ ఇండస్ట్రీకి చెందినవారు, బయటి వారు అని రెండు పదాలు వినిపిస్తుంటాయన్న రవీనా టాండన్.. ‘నేను వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. నన్ను అణగదొక్కాలని, కొలుకోనీయకుండా పాతి పెట్టాలని ప్రయత్నించారు. ఇక బయటి వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అని చెప్పింది. కానీ మురికి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి.. వాటిని ఎదిరించి ముందుకు సాగాలని సూచించింది.
https://twitter.com/TandonRaveena/status/1272600279108800514?s=19
ఏదేమైనా ‘నా ఇండస్ట్రీని నేను ప్రేమిస్తున్నానని’ తెలిపిన ఈ సీనియర్ హీరోయిన్.. ఒత్తిడి అధికంగా ఉంటుందనేది వాస్తవమని చెప్పింది. కానీ ఇక్కడ కూడా మంచి, చెడు రెండూ ఉంటాయని, మీ దారిలో ముళ్లుంటే తీసేసి నడవాలి.. తల ఎత్తుకుని నిలబడాలని కోరింది.
https://twitter.com/TandonRaveena/status/1272601523139170304?s=19