'తక్షణమే చేయాలి'

by Shyam |
తక్షణమే చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో పేద ప్రజలను ఆకలి కేకలు పెట్టిస్తోందని, ప్రభుత్వం పేద ప్రజల బాధలను ఆర్థం చేసుకొని తక్షణమే రేషన్ బియం పంపిణీ వేగవంతం చేయాలని టీపీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తన నివాసం నుంచి ఫేస్‌బుక్ ద్వారా కరోనా నివారణ చర్యలపై కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నివారించేందుకు పేద ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం సైనికులుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మతాల రంగు రుద్ది ప్రచారం చేయడం తగదన్నారు. అందరం కలిసి కట్టుగా కరోనా నివారణకు కృషి చేయాలన్నారు. మత పరమైన రంగు రుద్దడం మంచిది కాదన్నారు.

లాక్‌డౌన్ సందర్భంగా రాష్ట్ర పేద ప్రజానీకానికి 12 కిలోల బియ్యం కుటుంబానికి రూ. 1500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 10రోజులు గడుస్తున్నప్పటికీ కార్యక్రమం మాత్రం నత్తనడకనా నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా దాదాపు10 రోజులు అయ్యిందని, ఇంతవరకు 22 లక్షల కుటుంబాలకు మాత్రమే అందాయన్నారు. ఇంకా బియ్యం, డబ్బులు ఇచ్చే పనులు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వ్యవసాయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయని, సీఎం రూ.30 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారని, రైతులకు కనీస మద్దతు ధర అందేలా, ప్రతి గింజ కొనుగోలు చేసేలా రైతులకు అండగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల టెస్టులు చాలా ఆలస్యంగా జరుగుతున్నయన్నారు. సీసీఎంబీలో టెస్టులు చేయిస్తాం.. ఇంకా కొన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు కానీ, ఇంతవరకూ టెస్టుల వేగం పెరగలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో 25 వేల మందికి టెస్టులు చేయాల్సి ఉందని, అవి వేగంగా చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమయంలో దేశ రక్షణలో సైనికుల వలే పనిచేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

Tags: congress, Uttam kumar reddy, CM KCR, Government, formers, Ration

Advertisement

Next Story

Most Viewed