- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందట్లే..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన బియ్యం ఇంకా అందలేదు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది.పేదలకు ప్రతి నెలా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో అందించడంలేదు. దీంతో అధిక శాతం పేదలు బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల ప్రజలు నెలనెలా బియ్యాన్ని పొందుతున్నారు. తెలంగాణలో మొత్తం రేషన్ దుకాణాలు 17,038 ఉండగా ప్రతి రేషన్ దుకాణానికి కనీసంగా 250 క్వింటాళ్ళు బియ్యం చేరాల్సి ఉంది. ప్రతి షాపు నుంచి కనీసంగా 2500 మంది బియ్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు బియ్యం సరిపడా రాకపోవడంతో సుమారు 1000 మంది బియ్యం అందక తఇబ్బందులకు గురవుతున్నారు.
గోదాంలకు చేరని బియ్యం
రేషన్ బియ్యం గోదాంలకు పూర్తిస్థాయిలో చేరడంలేదు. దీంతో రేషన్ షాపులకు సరిపడా బియ్యం అందించలేని పరిస్థితి. వచ్చిన మొత్తంలో డీలర్లకు కోత విధిస్తూ బియ్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక రేషన్ డీలర్ కు కనీసంగా 300 క్వింటళ్ళ బియ్యం చేరాల్సి ఉండగా అందులో 200 క్వింటాళ్ళే అందిస్తున్నారని డీలర్లే వెల్లడిస్తున్నారు. గోదాంలలోనే బియ్యం లేదని, మిల్లర్ల నుంచి సేకరించాల్సిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించడంలేదని, ఫలితంగానే కోత విధించాల్సి వస్తుందని డీలర్లు వెల్లడిస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను తెలియజేయడంలేదు.