గూగుల్ లో ఏం వెతికారంటే?

by vinod kumar |
గూగుల్ లో ఏం వెతికారంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా.. ముందుగా ఎవర్నీ అడుగుతాం? ఒకప్పుడు వేరుకానీ ఇప్పుడైతే.. చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఏ మూలను శోధించాలన్నా.. గూగుల్ కేరాఫ్ గా మారింది. వ్యక్తిగత అవసరాలకు, సందేహాలకు ఇలా చాలా వాటికి గూగుల్ మీదనే ఆధారపడుతున్నమనడానికి గూగుల్ ట్రెండ్స్ విడుదల చేసిన ఈ జాబితా చూస్తేనే తెలిసిపోతుంది. అసలే లాక్డౌన్ టైమ్.. అందరూ ఇంటికే పరిమితమయ్యారు.. ఇలాంటి టైమ్ లో గూగుల్ లో ఏం సెర్చ్ చేసి ఉంటారు?

నెటిజన్లకు గూగుల్ ఓ ఆన్ లైన్ గురువు. గుండు సూది నుంచి అంతరిక్షం వరకు ఏ సందేహం వచ్చినా గూగుల్ ను అడగడం పరిపాటే. అయితే మరి ఈ లాక్డౌన్ వేళలో.. గూగుల్ టాప్ 5 సెర్చ్ ట్రెండ్స్ విడుదల చేసింది. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి అందరి జీవితాలు ఎలా మారిపోయాయో, ఆ ప్రభావం ఎలా ఉందో ఈ సెర్చ్ ట్రెండ్స్ అద్దం పడుతున్నాయి. అందులో టాప్ ట్రెండ్ లో ‘ఎసెన్షియల్ సర్వీస్’ నిలిచాయి. దగ్గర్లో ఉన్న రేషన్ షాపు, వెట్ డాక్టర్స్, ఫార్మసీస్, గ్రాసరీ డెలీవరి లు ఆ అత్యవసర సేవల జాబితాలో ఉన్నాయి. క్వారంటైన్ టైమ్ లో రేషన్ దుకాణం గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య 300 శాతం పెరిగింది. అలాగే ఇన్సూరెన్స్, మాట్రెస్, ఆన్ లైన్ సినిమాలు కూడా టాప్ ట్రెండ్ లో నిలిచాయి. వీటితో పాటు.. ‘జిమ్ ఎట్ హోమ్’, ‘5 మినట్ రెసిపీస్’‘లెర్న్ ఆన్ లైన్ ’ ‘టీచ్ ఆన్ లైన్’, ‘ఎట్ హోమ్ లెర్నింగ్’‘మెషిన్ లెర్నింగ్’, ‘డాటా సైన్స్’ సెర్చ్ లిస్ట్ లో ఉన్నాయి.

ఆరోగ్యం :

కరోనా వైరస్ ఇండియాలో అడుగు పెట్టిన రోజు నుంచి భారతీయలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే ఈ లాక్డౌన్ వేళ ‘ఇమ్యునిటీ’గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య 500శాతం పెరిగింది. ‘విటమిన్-సి’ వెతికే వాళ్లు 150 శాతం, ‘కన్సల్ట్ డాక్టర్ ఆన్ లైన్’ సెర్చ్ చేసే వాళ్లు 60 శాతం పెరిగారు.

టెక్ :

లాక్డౌన్ టైమ్ లో బయటకు అడుగు పెట్టే వీలు లేకుండా పోయింది. దాంతో ఆన్ లైన్ పేమెంట్స్ కు, ఆన్ లైన్ గ్రాసరీ సర్వీస్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ‘హౌ టూ చేంజ్ యూపీఐ పిన్’ సెర్చింగ్ రిజల్ట్ 200శాతం పెరిగింది. దాంతో పాటు కరెంట్ బిల్లులు కట్టే వెసులు బాటు కూడా లేకుండా పోవడంతో చాలా మంది ‘హౌ టూ పే ఎలక్ట్రిక్ బిల్ ఆన్ లైన్’ ‘ఎలక్ట్రిసిటీ బిల్ చెక్’లు ఎక్కువ మంది శోధించారు.

చదువు, ఉద్యోగం :

కరోనా ప్రభావం వల్ల అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’బాట పడితే.. విద్యార్థులు ‘ఆన్ లైన్ క్లాసులు’ వైపు దృష్టి సారిస్తున్నారు. దాంతో ‘హౌ టూ హోంస్కూల్ కిడ్స్’ ‘హౌ టూ వర్క్ ఫ్రమ్ హోమ్’‘ఆన్ లైన్ ఫ్రీ కోర్సెస్’ వంటి వాటిని బాగా సెర్చ్ చేశారు.

Tags : lockdown, google search, trends, online trends

Advertisement

Next Story