- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2025: పంజాబ్ vs కలకత్తా.. మరో రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ గేమ్ అవుతుందా

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ఇన్నింగ్స్ ను అందించింది. ఒక్క 17 ఐపీఎల్ (IPL) సీజన్ లోనే.. ఏండ్ల తరబడి ఉన్న అన్ని రికార్డులను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్, కేకేఆర్, ఆర్సీబీ జట్లు బ్రేక్ చేశాయి. ముఖ్యంగా 2024లో పంజాబ్ vs కలకత్తా మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ (Punjab) జట్టు ఎవరు ఊహించని విధంగా కేవలం 18.4 ఓవర్లలోనే 262 రన్స్ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ (KKR) జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 18.4 ఓవర్లలో 262 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. అలాగే ఐపీఎల్ చరిత్ర (History of IPL)లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి అత్యధిక పరుగుల మ్యాచుగా నిలిచింది.
కాగా ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ పంజాబ్, కేకేఆర్ (KKR) జట్లు ఈ రోజు తలపడనున్నాయి. పంజాబ్ హోమ్ గ్రౌండ్ (Punjab Home Ground) కావడంతో మరోసారి పాత రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే తమ పాత పగ తీర్చుకుంటామని, పంజాబ్ జట్టును వారి మైదానంలోనే ఓడిస్తామని కేకేఆర్ అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఈ సీజన్ లో పంజాబ్, కేకేఆర్ జట్లు నిలకడగా రాణిస్తున్నాయి. కేకేఆర్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడగా.. మూడు విజయాలతో ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ జట్టు ఐదు మ్యాచుల్లో ముడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. మరీ భారీ స్కోర్ అంచనాలు ఉన్న హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే.
పంజాబ్ అంచనా జట్టు: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), శ్రేయాస్ అయ్యర్ (c), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషక్ విజయ్‌కుమార్
కేకేఆర్ అంచనా జట్టు: సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ (WK), అజింక్యా రహానే (c), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా