- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో వింత : ఇంటి పెద్దలైన 22 మంది చిన్నారులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కుటుంబ పెద్ద అంటే తండ్రి లేదా తల్లి ఉంటుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఐదు నుంచి ఆరేళ్ల చిన్నారులు ఇంటి పెద్దగా ఉండటం సంచలనంగా మారింది. వారి పేరు మీదే రేషన్ కార్డులు సైతం జారీ కావడం గమనార్హం. అధికారులు నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఫైరవీలతో చిన్నోళ్లు సైతం పెద్దోళ్లుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో 22 మంది చిన్నారులకు రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. గ్రామానికి 65 కార్డులు మంజూరు కాగా, వాటిల్లో 22 చిన్నారులవే ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, పెళ్లై, వేరు కుటుంబం పెట్టిన వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. కానీ గ్రామానికి చెందిన ఐదు నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల పేరు మీద నూతనంగా ఇస్తున్న రేషన్ కార్డులు జారీ అయ్యాయి. క్షేత్ర పరిశీలనకు వచ్చిన అధికారులకు ఈ విషయం తెలిసి వెంటనే వాటిని రిజెక్ట్ చేశారు. కార్లు, పొలాలు, వ్యవసాయ భూముల ఉంటే రేషన్ కార్డు రాదని కొందరు రాజకీయ నాయకుల సహకారంతో అక్రమాలకు పాల్పడ్డట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నిజామాబాదు జిల్లాలో 2017 వరకు మీ సేవ కేంద్రాలు, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలకు 21,265 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఈ ఏడాది జూన్ 26 వరకు పరిశీలించారు. అందులో 5008 దరఖాస్తులు తిరస్కరించారు. ఈనెల 26 నుంచి16,257 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో ఇది వరకు 3,90,393 రేషన్ కార్డులు ఉండగా కొత్తవి పాతవి కలిసి 4,06,650 గా తెల్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో 2748 మంజూరు అయ్యాయి. అందులో నందిపేట్ 935 దరఖాస్తులు రాగా, 722 కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. తల్వేదలో 22 దరఖాస్తులు చిన్న పిల్లలు పేరు మీదుగా రావడంతో వాటిని క్షేత్ర స్థాయిలో ఆర్ఐలు పరిశీలించి తిరస్కరించారు. ఒక్క నందిపేట్ మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో కొత్తగా జారీ అయిన 16,257 కార్డుల్లో ఎంతమంది అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే లెక్కలు లేవు.