- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డుపై మల్లన్న సాగర్ నిర్వాసితుల రాస్తారోకో..!
దిశ, దుబ్బాక:
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో నష్టపోతున్న నిర్వాసితులు.. సిద్దిపేట-రామాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కాల్వల నిర్మాణానికి భూసేకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు పరిహారం తక్కువ ఇవ్వడంపై ధర్మారం గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సుమారు గంటన్నర పాటు సాగిన రాస్తారోకోలో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
మల్లన్న సాగర్ కాలువల నిర్మాణానికి ధర్మారంలో సుమారు 60 మంది రైతుల వద్ద 30 ఎకరాల వరకు సాగు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాలువల నిర్మాణం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకం కాదని.. భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఎకరానికి కేవలం రూ.లక్షా 90 వేలు కేటాయించడం సరైంది కాదన్నారు. మార్కెట్ రేటుకు అనుగుణంగా భూములకు ధరలను కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.