- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో మోడీ బొమ్మకు చెప్పు దెబ్బలు
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం పన్నులను పిండుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం వరంగల్‌లో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, మహిళా నేతలు మోదీ ఫ్లెక్సీ కటౌట్ లను చెప్పుల తో కొడుతూ తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. దాదాపు అర్ధగంట సేపూ జరిగిన రాస్తారోకోలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి.
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో నేతలు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బలవంతంగా పోలీసులు నాయినిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మిగతా నేతలను అరెస్ట్ చేశారు. అంతకుముందు నాయిని విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్60 ఏళ్ల పాలనలో పెట్రోలు ధరలు 60 దాటకుండా జాగ్రత్తగా వ్యవహరించినదని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన7 ఏళ్లలోనే 40 రూపాయలు పెంచి 100 రూపాయలకు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.