తగ్గేదేలే : డీగ్లామరస్ లుక్‌లో 'పుష్ప'రాజ్ సోల్ మేట్ : pushpa

by Shyam |   ( Updated:2021-09-29 02:16:22.0  )
తగ్గేదేలే : డీగ్లామరస్ లుక్‌లో పుష్పరాజ్ సోల్ మేట్ : pushpa
X

దిశ, సినిమా : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పుష్ప’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లుక్, దాక్కో దాక్కో మేక సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలవగా.. తాజాగా ‘పుష్ప’ సోల్ మేట్‌ను పరిచయం చేసింది మూవీ యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పిక్చర్ నుంచి హీరోయిన్ రష్మిక మందన లుక్ రివీల్ చేశారు. బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ హార్ట్ ఎవరిని చూస్తే మెల్ట్ అయిపోతుందో తనే ‘శ్రీవల్లి’ అంటూ రష్మికను ఇంట్రడ్యూస్ చేసిన మేకర్స్.. ఆమె ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ముందు చెప్పినట్లుగానే రష్మిక డీగ్లామరస్ లుక్‌లో గిరిజన అమ్మాయిగా కనిపిస్తుండగా.. పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న శ్రీవల్లిని పరిచయం చేశారు. మొత్తానికి ఈ సినిమా ద్వారా రష్మిక నటిగా మరో మెట్టు ఎక్కబోతుందని తెలుస్తుండగా.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.

https://twitter.com/MythriOfficial/status/1443066764024107009?s=20

Advertisement

Next Story