పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇరగదీయనున్న రష్మిక

by Shyam |
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇరగదీయనున్న రష్మిక
X

దిశ, సినిమా: ప్రెట్టీ గర్ల్ రష్మిక మందన ఫస్ట్ టైమ్ ఓ మ్యూజిక్ వీడియో చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ డిజిటల్, సాగా మ్యూజిక్ సమర్పణలో ‘టాప్ టక్కర్’ పేరుతో వస్తున్న ఈ వీడియో టీజర్ తాజాగా రిలీజ్ కాగా.. ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. రష్మిక స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్న సాంగ్‌లో యువన్ శంకర్ రాజా, బాద్‌షా, జోనిత గాంధీ స్టెప్స్ వేయడంతో పాటు మ్యూజిక్ కంపోజ్ చేశారు. హిందీ, తమిళ్ కాంబినేషన్‌లో వస్తున్న సాంగ్‌కు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, బాద్‌షా కలిసి లిరిక్స్ అందించగా.. అమర్‌ప్రీత్ జీఎస్ చాబ్రా దర్శకత్వం వహించారు. టీజర్‌కు ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ చూసేందుకు ఎగ్జైట్ అవుతుండగా.. రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంపై కాస్త నిరాశలో ఉన్నట్లు చెప్తున్నారు.

కాగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘టాప్ టక్కర్’ టీజర్ షేర్ చేసిన రష్మిక.. తొలిసారి ఇలాంటి ప్రయత్నం చేశానని, తప్పకుండా అభిమానులకు నచ్చుతుందని అభిప్రాయపడింది. పలు ఇండస్ట్రీలకు చెందిన బెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉందన్న భామ.. నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపిస్తున్న రష్మిక లుక్‌తోనే అదరగొట్టింది. ఇక నుంచి వెడ్డింగ్స్, స్కూల్ కాలేజీ ఫంక్షన్స్, పార్టీల్లో ఈ పాటే ఫస్ట్ ప్లే అవుతుందని చెప్పింది. తప్పకుండా ఇది గుడ్ డ్యాన్స్ నంబర్ అవుతుంది.. తనను నమ్మండని చెప్తోంది.

Advertisement

Next Story