అఖిల్‌తో కన్నడ క్రష్..

by Shyam |
అఖిల్‌తో కన్నడ క్రష్..
X

దిశ, వెబ్‌డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక మందన మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతుంది. లేటెస్ట్‌గా సూర్యతో కలిసి పాండిరాజ్ డైరెక్షన్‌లో కోలీవుడ్ సినిమా చేసే చాన్స్ ఉందని తెలియగా.. టాలీవుడ్‌లోనూ సూపర్ చాన్స్ కొట్టేసిందని సమాచారం. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని ఇప్పటికే సినిమా ప్రకటించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో రష్మిక అఖిల్‌తో రొమాన్స్ చేయనుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా.. ఫ్యాన్స్ వీరిద్దరి కెమిస్ట్రీని స్క్రీన్‌పై చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక ఫ్యాన్స్ (రోషియన్స్) సూపర్ హ్యాపీగా ఉన్నారు. కారణం ఈ కన్నడ క్రష్‌ను నేషనల్ ఫిమేల్ క్రష్‌గా గూగుల్ గుర్తించడమే. దీనితో ఈ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న రోషియన్స్.. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా, రష్మిక మందన పేరుతో ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు.

Advertisement

Next Story