అలా చేయొద్దు : రష్మిక

by Jakkula Samataha |
అలా చేయొద్దు : రష్మిక
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రష్మిక మందన అభిమానులను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచేందుకు ట్రై చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా పలు సలహాలు, సూచనలు ఇచ్చే ఈ భామ, క్యూట్ స్మైల్‌తో ఉన్న తన ఫొటోలను షేర్ చేస్తూ.. స్ట్రెస్‌తో ఉన్న అభిమానులకు కాస్త రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుంటుంది. ఈ మధ్యే తన ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ ‘సుల్తాన్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రశాంతంగా ఉన్న రష్మిక.. హడావిడిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో చెప్తోంది.

ఏమీ తెలియకుండా ఒకరితో ప్రేమలో పడిపోకూడదని తెలిపిన క్యూట్ రష్మిక.. అలాంటి టైమ్‌లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోరాదని సూచిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని వదులుకోకూడదని, ఒకరి క్యారెక్టర్‌ను జడ్జ్ చేయకూడదని అంటోంది. హడావిడిగా భోజనం చేయడం.. ఎవరో తెలుసని భ్రమపడటం మానుకోవాలని సూచిస్తోంది రష్మిక.

కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో గిరిజన యువతిగా కనిపించనున్న బ్యూటీ.. ఈ సినిమా తన కెరియర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది.

Advertisement

Next Story