‘ఆఫ్ఘాన్‌లో రషీద్ ఖాన్‌ పరిస్థితి ఆందోళనకరం’

by Anukaran |
‘ఆఫ్ఘాన్‌లో రషీద్ ఖాన్‌ పరిస్థితి ఆందోళనకరం’
X

దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్ల దుశ్చర్య, ఆఫ్ఘానిస్తాన్‌ అధ్యక్షుడు రాజీనామాతో ఆ దేశంలో అతలాకుతల పరిస్థితులు నెలకొన్నాయి. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నేతల పరిస్థితి సైతం అధ్వాన్నంగా తయారైంది. మంత్రులు, అధికారులు భయంతో దేశం నుంచి పారిపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులను సొంతం చేసుకున్న ఆఫ్ఘాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. చివరగా తనతో చాటింగ్ చేశానని.. రషీద్ కనీసం తన ఫ్యామిలీలోని నలుగురిని దేశం దాటించలేకపోతున్నాడని చెప్పాడు. అందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం అవ్వడం లేదని.. రషీద్ ఖాన్, ఆఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు అదుపులో లేవంటూ కెవిన్ పీటర్సన్‌ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టిన రషీద్ Can’t sleep అంటూ దేవుడిని ప్రార్థించాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్‌ ఇన్‌స్టా స్టేటస్ తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఒక దేశాన్నే తాలిబన్లు ఆక్రమించుకోవడం.. ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed