రషీద్ ఖాన్ అరుదైన ఘనత

by Shyam |
Rashid khan
X

దిశ, స్పోర్ట్స్: ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. అబుదాబిలో జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో రషీద్ ఖాన్.. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు.. మొత్తం 99.2 ఓవర్లు వేశాడు గతంలో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ 98 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తాజాగా రషీద్ ఖాన్ అతడి రికార్డును అధిగమించాడు. అయితే మొత్తానికి అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్నది. 1998లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌పై 113.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కాగా, రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుమ్యాచ్ సిరీస్ 1-1తో సమం అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed