- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పక్కా కమర్షియల్’గా తయారవుతున్న రాశీ ఖన్నా

దిశ, సినిమా : హీరోయిన్ రాశీ ఖన్నా క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్(వెబ్ సిరీస్), మాలీవుడ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్(అంధాదున్ రీమేక్) షూటింగ్స్‌తో బిజీగాఉన్న భామ.. మరోవైపు మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హల్ చల్ చేస్తోంది. తన చివరి చిత్రం ‘ప్రతీరోజు పండగే’ సినిమాలో ఏంజెల్ ఆర్ణ క్యారెక్టర్ ఇచ్చి రాశీ ఖన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసిన మారుతి.. ఈ సారి కూడా తన కోసం క్రేజీ రోల్ ప్లాన్ చేశారని సమాచారం. మూవీ వర్కింగ్ స్టిల్స్‌లో రాశీ లాయర్ గెటప్‌లో కనిపిస్తుండగా.. ‘పక్కా కమర్షియల్’ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. కాగా ‘జిల్’ తర్వాత రాశీ, గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జాక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.