- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూఢిల్లీ: హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన విమర్శలు సంచలనాన్ని రేపాయి. ఢిల్లీకి వచ్చిన టీకాలను వేగంగా పంపిణీ చేసి వ్యాక్సిన్‌ల కొరత ఉన్నట్టు కేజ్రీవాల్ ప్రదర్శన చేస్తు్న్నారని, కావాలనే టీకాలపై రాజకీయం చేస్తు్న్నారని అన్నారు. నిజానికి హర్యానా కంటే ఢిల్లీకి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో టీకాలు అందుతున్నాయని, ఢిల్లీ లాగే తాము కూడా వేగంగా పంపిణీ చేయవచ్చునని, కానీ, చేయడం లేదని తెలిపారు. హర్యానా ఒకే రోజు రెండు లక్షల డోసులను పంపిణీ చేయగలదని, కానీ, మళ్లీ స్టాక్ వచ్చే వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించడానికి రోజుకు 50వేల నుంచి 60వేల టీకాలను అందిస్తున్నట్టు వివరించారు.
హర్యానా సీఎం వ్యాఖ్యలు చేస్తున్న వీడియోను జతచేసి ట్విట్టర్‌లో ఢిల్లీ సీఎం సూటిగా సమాధానం చెప్పారు. ‘ఖట్టార్ సాహబ్, టీకాలతోనే ప్రజలను బతికించగలం. ఎంత తొందరగా టీకాలు వేస్తే, అంత తొందరగా వారిని సురక్షితులను చేసినవాళ్లమవుతాం. ప్రజల ప్రాణాలను రక్షించడమే నా లక్ష్యం, కానీ టీకాలను కాదు’ అని కేజ్రీవాల్ స్పందించారు. టీకా పంపిణీని ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం వహించడమూ రాజనీతి అని చెప్పిన హర్యానా సీఎం ఖట్టార్‌కు ధన్యవాదాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వం దగ్గర టీకాలున్నాయని వెల్లడిస్తూనే వాటిని స్వల్ప సంఖ్యలో పంపిణీ చేస్తున్నట్టు వివరించారని ట్వీట్ చేశారు. అందుకే రాష్ట్రంలో టీకాలు లభించడం లేదేమో అని పేర్కొన్నారు.