ఏపీలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి

by srinivas |   ( Updated:2021-06-25 03:40:55.0  )
ఏపీలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రెండేళ్లుగా మహిళపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్‌ల ప్రచారం ఏపీ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 19 జూన్ 2021 తాడేపల్లిలోని సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువతి అత్యాచారానికి గురవ్వడం దురదృష్టకరమన్నారు.

ఘటన జరిగిన ప్రాంతం సీఎం నివాసానికి, డీజీపీ, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం అన్నారు. అలాగే 22 జూన్ 2021 దళిత మహిళ మల్లాది మరియమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మహిళలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం చేసిందల్లా దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, దిశ మొబైల్ వెహికల్స్ పేరిట వైసీపీ రంగులు వేసుకోవడమేనంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడున్న చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళా రక్షణకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి తెలుసుకోవాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణ చేసేందుకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని వంగలపూడి అనిత కోరారు.

Advertisement

Next Story

Most Viewed