మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి..

by Anukaran |
మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ, తమిళ సినీ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ నటి అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనపై బాధితురాలు బెంగళూరు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఓ ప్రైవేట్ సంస్థలో సీఈవోగా పనిచేస్తున్న మోహిత్ ఆమెపై అత్యాచారం చేసి పరారైనట్లు గుర్తించారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు 2018లో మోహిత్ పరిచయమయ్యాడని తెలిపింది. ఈ తరుణంలోనే తనతో స్నేహం చేశాడని.. అతడు పనిచేస్తున్న కంపెనీకి తనను క్యాంపెనర్ అంబాజీడర్‌గా నియమించాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తనకు మోహిత్ సన్నిహితం పెంచుకొని గోవా తదితర ప్రాంతాల్లో పర్యటకు తీసుకెళ్లడని బాధితురాలు తెలిపారు. ఆ తర్వాత తన డబ్బులపై కన్నెసిన అతడు కంపెనీ నష్టాల్లో ఉందని.. తన నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడని వాపోయారు. ఆ తర్వాత మోహిత్ బర్త్ డే పేరు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాడని.. అదే సమయంలో తనకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. దాదాపు 20 లక్షల వరకు వసూలు చేసుకున్నాడని బాధిత నటి ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో మోహిత్ కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story