- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీవీ చూసేందుకు వచ్చిన బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
దిశ, ఏపీ బ్యూరో: కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంటికి టీవీ చూసేందుకు వచ్చిన 12 ఏళ్ల బాలికను భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం దాల్చడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి. సిగడాం మండలం గెడ్డకంచరాం గ్రామానికి చెందిన లొట్ట అనిల్ (26) అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఆ బాలిక ఇంట్లో టీవీ లేకపోవడంతో అనిల్ బాలికకు మాయ మాటలు చెప్పాడు.
తన ఇంట్లో ఉన్న టీవీ చూసేందుకు వస్తే నచ్చిన చానల్‌లో.. ఇష్టమైన ప్రోగ్రాం చూసుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో అనిల్ మాటలను నమ్మిన ఆ చిన్నారి.. అతని ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే బాలికలో వచ్చిన శారీరక మార్పులను గమనించిన తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో గర్భవతిగా నిర్ధారణవ్వడంతో వారు నివ్వెరపోయారు. తల్లిదండ్రులు బాలికని ప్రశ్నించగా అనిల్ చేసిన దారుణాన్ని చెప్పి బోరున విలపించింది. దీంతో బాధితులు శుక్రవారం జి.సిగడాం పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.ఎ.అహ్మద్ కేసు నమోదు చేసి.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.