గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్ కోసం వెళ్లగా..!

by Sumithra |   ( Updated:2021-05-30 06:33:32.0  )
గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్ కోసం వెళ్లగా..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మాయమాటలు చెప్పి మైనర్ బాలికను లొంగదీసుకోవడమే కాకుండా గర్భవతిని చేశాడో ఘనుడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో కుటుంబసభ్యులు గర్భం తొలిగించేందుకు ప్రయత్నించారు. అందుకోసం అధిక డబ్బు ఖర్చు అవుతుందని జిల్లా కేంద్రంలోని ఓ డాక్టర్ చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేసి బాలికను ఇంట్లోనే దాచి ఉంచారు. విషయం తెలియడంతో గ్రామ సర్పంచ్ స్థానిక అంగన్వాడీ టీచర్ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు, సఖీ కేంద్రానికి సమాచారం అందించారు.

దీంతో బాలికను అధికారులు జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తీసుకెళ్లి గర్భానికి కారణం ఎవరన్నది విచారిస్తున్నట్టు సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ అధికారి భానుప్రియ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య కుమార్ చెప్పాడు. అయితే, బాలిక గర్బం దాల్చడానికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసిగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి బాలిక కుటుంబానికి బంధువు అని సమాచారం. బాలికపై అఘాయిత్యం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed