- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం
దిశ, మంగపేట : ఏడు సంత్సరాల బాలిక పై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఏడు సంత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
కానీ కొందరు మధ్యవర్తులు బాలిక తల్లిదండ్రులను భయపెడుతున్నట్లు సమాచారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి బాధితుడి నుంచి బాలికకు నగదు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. అలానే బాలిక పై లైంగి దాడి జరిగి ఐదురోజులు గడుస్తున్నా నిందితుని పై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
వివరాల ప్రకారం… రాజుపేట గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలిక పై అదే గ్రామానికి చెందిన యువకుడు ఐదు రోజుల క్రితం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో యువకుడు బాలికని మభ్యపెట్టి నిర్మానుశ్య స్థావరంలో లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలిసింది. రక్తస్రావంగా ఉంటున్న బాలికను తల్లి గమనించి ప్రశ్నించడంతో బాలిక అసలు విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న తల్లి మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.