బిగ్ బ్రేకింగ్.. యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు ఆసుపత్రి గదిలో..

by Anukaran |   ( Updated:2021-09-28 22:14:47.0  )
బిగ్ బ్రేకింగ్.. యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు ఆసుపత్రి గదిలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : కామాంధులు రెచ్చిపోతున్నారు. పైశాచికత్వానికి వయసుతో సంబంధం లేకుండా కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఒంటరిగా కనిపిస్తే రక్షణనివ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

బుధవారం నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతికి మద్యం తాగించి.. నలుగురు వ్యక్తులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. బాధిత యువతికి మద్యం తాగించి నలుగురు వ్యక్తులు.. ఆమెను ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ యువతికి మద్యం తాగించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. దారుణ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story